/rtv/media/media_files/2025/08/31/cm-ram-charan-2025-08-31-17-52-56.jpg)
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిశారు. మైసూరులో వీరిద్దరి భేటీ జరిగింది. కాసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడే సీఎం సిద్ధరామయ్య పర్యటిస్తూ ఉండటంతో వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, శాసనమండలి సభ్యుడు డాక్టర్ యతీంద్ర కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్యను శాలువతో కప్పి సత్కరించారు రామ్ చరణ్.
Actor Ram Charan Meets Karnataka CM Siddaramaiah In Mysuru : CM ಸಿದ್ದರಾಮಯ್ಯರನ್ನ ಭೇಟಿಯಾದ ನಟ ರಾಮ್ ಚರಣ್
— Republic Kannada (@KannadaRepublic) August 31, 2025
WATCH #RepublicKannada LIVE: https://t.co/c4LtlT6bHu#cmsiddaramaiah#ramcharan#santhoshlad#actor#teluguactor#chiranjeevi#megapowerstar#karnataka#mysuru#republickannadapic.twitter.com/elpOo0GY7H
1,000 మంది డ్యాన్సర్స్ తో
మైసూరులో అద్ధూరి సెట్ వేసి ఓ మాస్ సాంగ్‌ను మేకర్స్ షూట్ చేస్తున్నారు. దాదాపుగా 1,000 మంది డ్యాన్సర్స్ తో ఈ పాటను ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. కాగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కావచ్చని సమాచారం.
ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్‌లు, గ్లింప్స్‌లో రామ్ చరణ్ రూరల్, రస్టిక్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పక్కా గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని అర్థమైంది. 'గేమ్ ఛేంజర్' ప్లాప్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.