MP Mahua Moitra : ఎంపీ మహువా మొయిత్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను ఉద్దేశిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది.

New Update
Mahua Moitra

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah) ను ఉద్దేశిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)  ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది. ఓ స్థానిక వ్యక్తి ఫిర్యాదు మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌ పోలీసులు  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా 1971 సమయంలో రాయ్‌పుర్‌లోని మానా క్యాంప్‌ ప్రాంతంలో అనేకమంది బంగ్లాదేశీ శరణార్థులు స్థిరపడ్డారని, మహువా వ్యాఖ్యలు వారిలో భయాందోళనలు రేకెత్తించాయని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ కోత్వాలీ పోలీసు స్టేషన్‌లోనూ ఆమెపై ఫిర్యాదు నమోదైంది. 

Also Read :  Missing Case: 3 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. కట్‌ చేస్తే నదిలో మృతదేహాం

FIR Against TMC's MP Mahua Moitra For Objectionable

ఎంపీ సంచలన కామెంట్స్

వెస్ట్ బెంగాల్‌(West Bengal) లో అక్రమ చొరబాటుకు సంబంధించి ఎంపీ మంగళవారం సంచలన కామెంట్స్ చేశారు. నదియా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న అక్రమ చొరబాట్ల గురించి మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే చొరబాటుదారులు అని చెబుతున్నారు. ఒకవేళ సరిహద్దుల గుండా రోజూ లక్షల మంది మన దేశంలోకి చొరబడుతుంటే, అది ఎవరి తప్పు అంటూ ఆమె ప్రశ్నించారు. ఒకవేళ దేశ సరిహద్దులను రక్షించడంలో హోంమంత్రిత్వ శాఖ విఫలమైతేముందుగా అమిత్ షా తల నరికి ప్రధాని నరేంద్ర మోదీ టేబుల్ మీద పెట్టాలంటూ ఆమె  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  

Also Read :  Screwworm: వామ్మో.. మెక్సికోలో మనిషి మాంసం తినే స్క్రూవార్మ్స్.. మన దేశానికి పొంచి ఉన్న ముప్పు!!

ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజా ప్రతినిధులను అవమానపరచడమేనంటూ బీజేపీ(BJP) నేతలు ఖండించారు. మహువా వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇది బాధ్యతారాహిత్యమైన చర్య అని బీజేపీ విమర్శించింది. వెంటనే ఆమె తాను చేసిన కామెంట్స్ పై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పటికే పోలీసులకు పలువురు నేతల నుంచి పోలీసులకు  ఫిర్యాదులు కూడా అందాయి.  

Also Read :  Telangana: కేసీఆర్‌కు నిజాం కంటే ధనవంతుడు కావాలనే దురాశ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు