Ponnam Prabhakar: కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్‌

ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

New Update
BREAKING

BREAKING

ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం(bus-fire-accident)పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌(ponnam-prabhakar) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నా్రంటూ మంత్రి చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై తాను ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్‌ సిరి, ఎస్పీలతో మాట్లాడానని పొన్నం అన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ప్రైవేటు ట్రావెల్స్‌ మధ్య అనారోగ్యకర పోటీ ఉందని, దాన్ని నివారిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. 

Also Read :  శంకరా ఎంత పనిచేశావ్రా.. గుండె పగిలేలా రోదిస్తున్న తల్లి

Ponnam Prabhakar Comments On Kurnool Bus Accident

Also Read :  ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది..తర్వాత కాలిపోయింది..బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి

Advertisment
తాజా కథనాలు