/rtv/media/media_files/2025/09/26/komatireddy-2025-09-26-07-14-22.jpg)
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమన్నారు. ఏపీలో జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకు వెసులుబాటు ఇచ్చామని తెలిపారు. అయితే ధరల పెంపుతో సామాన్యులు నష్టపోతున్నాడని మంత్రి చెప్పుకొచ్చారు . సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్‌ను హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇచ్చేందుకైనా తాము సిద్ధమేనని తెలిపారు.
Also Read : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో మూడు రోజులు వానలే
ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓజీ టికెట్ ధరల పెంపుకి అనుమతిస్తూ హోంశాఖ జారీ చేసిన మెమోను కొట్టివేస్తూ జస్టిస్ NV శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. టికెట్ ధరల పెంపుపై హోంశాఖ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ.. మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ CSకి ఎలాంటి అధికారాలులేవని వాదించారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలోజాయింట్ కలెక్టర్ కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందని కోర్టుకు తెలిపారు. సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదన్న నిబంధనలు ఉన్నాయని వివరించారు. గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా.... హోం శాఖ అండర్ టేకింగ్ ఇచ్చిందని తెలిపారు. ఆ వాదనని పరిగణలో తీసుకున్న జస్టిస్ శ్రవణ్ కుమార్ .. టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేశారు.
Also Read : టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం
ఓజీ'తో ప్రజలకు ఒరిగేదేముంది?
— Rahul (@2024YCP) September 26, 2025
టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
రూ.800 వెచ్చించి ఎందుకు టికెట్ కొనాలి?
ప్రజలను అడిగి సినిమా తీశారా?
పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఫైర్
సింగిల్ జడ్జే నిర్ణయిస్తారన్న డివిజన్ బెంచ్ pic.twitter.com/MxKPhuA9ov