/rtv/media/media_files/2026/02/10/sama-rammohan-reddy-2026-02-10-13-28-29.jpg)
మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల ఒత్తిడి వల్లే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఆత్మహత్యకు రాంచందర్ రావు, డీకే అరుణ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలే ఒత్తిడి చేస్తేనే బీజేపీ నేత సూసైడ్ చేసుకున్నారన్నారు. రాజకీయ పబ్బం గడుపూకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజకీయం కోసం బీజేపీ నేతలు ఇంతగా దిగజారుతారా? అని ప్రశ్నించారు. మహాదేవప్ప మరణానికి కారణాలు బయటకి రావాలన్నారు. మహాదేవప్పకి బీ ఫారం ఇచ్చాక ఏమయిందో బీజేపీ నేతలే చెప్పాలన్నారు.
Follow Us