Hyderabad: ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహీంద్ర షో రూం వెనుక ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 11 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్: హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహీంద్ర షో రూం వెనుక ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ మంటలతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు మధ్యాహ్నం రెండు గంటలకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేశారు. Also Read: ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన! షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆ గోదాంలో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఆరాంఘర్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. Also Read: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు ఇదిలాఉండగా.. గత గురువారం రాంనగర్‌లో కూడా రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ చీర షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చీరల దుకాణం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్మేడయంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కూడా భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇదిలాఉండగా.. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు! Also Read: నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్ #telugu-news #hyderabad #fire-accident #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి