సంగారెడ్డిలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్ పట్టుబడ్డాక డ్రైవర్, క్లీనర్‌ పరారయ్యారు.

New Update
Drugs

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో అధికారులు సోదాలు చేశారు. లారీలో తరలిస్తుండగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్

డీఆర్‌ఐ, నార్కొటిక్‌  డ్రగ్స్‌ కంట్రోల్, సెంట్రల్‌ విజిలెన్స్‌ బృందాలు ఈ తనిఖీలో పాల్గొన్నాయి. గంజాయిని పట్టుకున్న వెంటనే డ్రైవర్, క్లీనర్‌ పరారయ్యారు. అయితే వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టు నుంచి ముంబయికి తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే లారీని చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన‌కు తరలించారు.     

ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇదిలాఉండగా.. ఈ మధ్య కాలంలో చాలాచోట్ల భారీగా డ్రగ్స్‌ పట్టుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అరేబియ మహాసముద్రంలో 500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంక నౌకాదళం, భారత నౌకదళం చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  రెండు పడవలు, సిబ్బందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తదుపరి చర్యల కోసం శ్రీలంక అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.       

Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?

Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు