MARVAADI  : తెలంగాణలో ముదురుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం

తెలంగాణ‌లో మ‌రో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. ఈ విషయమై సోష‌ల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడీ అంటూ పెద్దఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ముదురుతుంది. సోషల్‌మీడియాలో విస్తృతంగా మార్వాడీ గో బ్యాక్ పోస్టులు దర్శన మిస్తున్నాయి.

New Update
Marwari Go Back Movement

Marwari Go Back Movement

 MARVAADI : తెలంగాణ‌లో మ‌రో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. ఈ విషయమై సోష‌ల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడీ అంటూ పెద్దఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ముదురుతుంది.సోషల్‌మీడియాలో విస్తృతంగా మార్వాడీ గో బ్యాక్ పోస్టులు దర్శన మిస్తున్నాయి,తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీల పెత్తనం పెరిగిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. స్థానికులెవరూ మార్వాడీ దుకాణాల్లో...వస్తువులు కొనుగోలు చేయొద్దని డిమాండ్ పెరుగుతుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా  ఈ నెల 18న స్థానిక వ్యాపారులు  ఆమన్‌గల్ బంద్‌కు పిలుపునిచ్చారు. 

 అయితే ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ఓ కార‌ణం కూడా ఉంది. మార్వాడీల దోపిడిని వివ‌రిస్తూ గోరేటి ర‌మేష్ అనే వ్యక్తి ఓ పాట పాడ‌టంతో ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ‌తంలో గోరేటి ర‌మేష్ ప్రజానాట్యమండ‌లిలో పనిచేశారు. దీంతో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన‌వారు, ప్రజాస్వామ్యవాదులు అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో మర్వాడీలు చేస్తున్న దోపిడీని ఎండగట్టాలని నిర్ణయించారు.  

Also Read: ఢిల్లీలో కుప్పకూలిన చారిత్రక కట్టడం.. స్పాట్లో 9 మంది

 స్థానికులు దుకాణాలు పెట్టుకుంటే ఇక్కడివారికి పని కల్పి్స్తారని అదేమార్వాడీలు తమ వాళ్లనే పనిలో పెట్టుకోవడంతో పాటు ఇక్కడి దుకాణాదారులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా హోల్ సేల్ మార్వాడీ వ్యాపారులు స్థానిక దుకాణదారులకు ఎక్కువ రేటుకు వస్తువులను అమ్మితే, మార్వాడీ దుకాణదారులకు తక్కువ రేటుకు అమ్ముతున్నారని చెబుతున్నారు. ఇది వరకు మార్వాడీలు కేవలం బంగారం, హోల్ సేల్ కిరాణం, స్వీట్ హౌజ్ వ్యాపారం మాత్రమే చేసే వారని ఇప్పుడు అన్ని వ్యాపారాల్లో దూరి స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Crime News: అనకాపల్లిలో అమానుషం.. గర్భిణిని చంపి.. శవాన్ని కాల్చి..!

అయితే మార్వాడీలకు మద్దతుగా బండి, రాజాసింగ్ నిలుస్తున్నారు.'మార్వాడీ గో బ్యాక్' నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మార్వాడీ గో బ్యాక్' పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. 'మార్వాడీ గో బ్యాక్' అంటే, మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు.కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వారు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని అన్నారు. తెలంగాణను దోచుకోలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని అన్నారు.మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీనింగ్ దుకాణాలు ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాజాసింగ్‌ కూడా అదే అరోపణ చేశారు.

Also Read : దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు