/rtv/media/media_files/2025/08/14/vizag-crime-2025-08-14-16-09-51.jpeg)
Vizag crime
నేటి కాలంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. మహిళలను కిడ్నాప్ చేసి అతి కిరాతంగా చంపుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని గర్భవతిని కొందరు దుండగులు హత్య చేసి కాల్చిపడేశారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపర్డెంట్ తుహిన్ సిన్హా పరిశీలించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వెడ్, క్లూస్ టీం తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Delhi Crime : ఢిల్లీలో మరో దారుణం.. బాత్రూంలో యువతిపై సామూహిక అత్యాచారం!
అనకాపల్లిలో గర్భిణిని చంపి ఆ తర్వాత కాల్చిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గర్భిణికి తెలిసిన వారే ఇలా చేశారని పోలీసులు గుర్తించారు.https://t.co/OWnwB6YLZa#Anakapalli#pregnantwoman#incident#RTV
— RTV (@RTVnewsnetwork) August 14, 2025
తెలిసిన వాళ్లే ఇలా చేశారని..
మృతిరాలి వయస్సు దాదాపుగా 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు గుర్తించారు. గర్భిణికి తెలిసిన వారే కాళ్లు చేతులు కట్టేసి, పీక నులిమి చంపేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. గర్భిణి అని చూడకుండా అతి క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గర్భిణి భర్త లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలా చేశారా? లేకపోతే బయట వారు ఇలా చేశారా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: TG Crime: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ.. వెంటిలేటర్‌పై యువతికి చికిత్స.. పరారీలో లవర్
పదేళ్ల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం..
ఇదిలా ఉండగా తెలంగాణలోని నల్గొండలో ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆపై బాలికను చంపేయడంతో నిందితుడికి పోక్సో కోర్టు రూ.1.10 లక్షల జరిమానాతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ ఘటన పదేళ్ల కిందట జరిగింది. ఇన్నేళ్ల నుంచి కోర్టులో విచారణ చేపట్టారు. తాజాగా పోక్సో కోర్టు ఈ కేసుపై తీర్పునిచ్చింది. నల్గొండలో ఉంటున్న ఓ 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన మోహమ్మీ ముకఱ్ఱము ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ విషయం ఎవరికైనా చెబుతుంది ఏమోనని భయంతో ఆ యువకుడు ఆమెను చంపేసి కాలువలో పడేవాడు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోక్సో చట్టం కింద పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడు మోహమ్మీ ముకఱ్ఱముకి ఉరిశిక్షతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించింది. పదేళ్లకు ఆ మైనర్ బాలికకు న్యాయం జరిగింది.