/rtv/media/media_files/2024/12/07/2bmO0o0DfPbBOv7fALmB.jpg)
తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కారు కలకలం రేపింది. ఉన్నట్టుండిగా కారులో మంటలు చెలరేగాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భక్తులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటల్లో కారు ముందు భాగం మాత్రం పూర్తిగా కాలిపోయింది.
అసలేమైంది..
బెంగళూరుకి చెందిన భరత్ కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనానికి కారులో తిరుమలకు వచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరి..రాత్రి 9:05 గంటలకు తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు. గమ్యం చేరుకున్నాక కారులోంచి పొగలు వస్తున్నాయని భరత్ గమనించారు. దీంతో వెంటే అప్రమత్తమై..కారులో నుంచి అందరినీ కిందికి దింపేశారు. ఆ తరువాత క్షణాల్లో మంటలు వ్యాపించాయి. దాంతో పాటూ కారు రన్ అవడం కూడా ప్రారంభించింది. దీంతో అక్కడ దగ్గరలో ఉన్న భక్తులు భయాందోళనలు చెందారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కారును అదుపులోకి తీసుకోవడమే కాక మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. అయితే, కారులో ప్రయాణించిన భక్తులు సురక్షితంగా ఈ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Also Read: Syria: సిరియాలో కల్లోలం..డమాస్కస్ తిరుబాటుదారుల వశం