Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహించే ఎయిర్ షో కు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముందని, వారికి ఏ ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్బంగా ఆదివారం ఎయిర్ షో, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్ల గురించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
Also Read: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు!
ఈ సందర్బంగా తెలంగాణ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. భారతీయ వైమానిక దళం ఏర్పాటు చేస్తున్న ఎయిర్ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొంటాయని వివరించారు. ఈ రకమైన విన్యాసం చేయగల సత్తా ప్రపంచంలో కేవలం 5 టీంలకు మాత్రమే ఉందని తెలిపారు. కాగా, అందులో ఒక టీమ్ హైదరాబాద్ లో విన్యాసాలు చేయడం రాష్ట్రానికే గర్వ కారణం అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, ఐఏఎఫ్ కి చెందిన సీనియర్ అధికారులు ఈ ఎయిర్ షో వీక్షించడానికి హాజరు కానున్నారు.
Also Read: Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!
కనుక విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎయిర్ షో లో సూర్యకిరణ్ కు చెందిన విమానాలు పాల్గొననున్నాయి. ఈ షోతో పాటు సాయంత్రం నిర్వహించే మ్యూజికల్ కాన్సర్ట్ కు నెక్లెస్ రోడ్ , పీవీ మార్గ్ లలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నారు. వీరి సౌకర్యార్థం ఇప్పటికే ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Also Read: Syria: సిరియాలో కల్లోలం..డమాస్కస్ తిరుబాటుదారుల వశం
ఈ ఎయిర్ షో తరువాత రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వారికి తగిన విధంగా సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్ చెప్పారు.నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం భారీ ఎయిర్ షో నిర్వహించనున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ ఎయిర్‌షో చేయనున్నారు. ఎయిర్ షోలో భాగంగా వాయుసేన విమానాలు అద్భుత విన్యాసాలు ప్రదర్శించనున్నాయి.
Also Read: TGPSC: 1,368 కేంద్రాల్లో గ్రూప్–2 ఎగ్జామ్
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటలపాటు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజు డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది మహిళలు వస్తారని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ అధికారులకు చెప్పారు. విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా దాదాపు 150 మంది ప్రముఖులు కూర్చునేలా ప్రధాన వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదిక ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే స్వయం సహాయ బృందాలు మహిళలు, ఇతరులందరూ మధ్యాహ్నం 4.30 లోగా సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పారు.