TG Crime : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రవీణ్‌, ప్రమీల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది.

New Update
rangardddy affiar

rangardddy affiar

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను ఉరివేసి చంపిదో భార్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌, ప్రమీల దంపతలకు ఇద్దరు సంతానం. అయితే ప్రమీల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భర్త ప్రవీణ్ కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భర్తను చంపేసి ప్రియుడితో కలిసి సుఖంగా ఉండాలని ప్రమీల స్కెచ్ వేసింది.  

Also Read: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Also Read :  Pakistan కి ముందు నుయ్యి వెనక గొయ్యి.. 3 ముక్కలవ్వనున్న పాక్ దేశం!

ప్రియుడిని ఇంటికి పిలిచి

ప్లాన్ లో భాగంగా..  శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడిని ఇంటికి పిలిచిన ప్రమీల..  ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. కుటుంబసభ్యులకు,బంధువులకు తన భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. అయితే అనుమానం వచ్చిన ప్రవీణ్‌ తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమీలను అదుపులోకి తీసుకుని విచారించగా..  ఆమె అసలు విషయాన్ని ఒప్పుకుంది. ప్రమీల పాటుగా ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Also Read: ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్‌ యాత్ర.. కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ప్రకటన

Also Read :  ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి

 

ranga-reddy | wife | husband | lover

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు