/rtv/media/media_files/2025/04/26/kSRNmjHrKHm0xCKKpzUv.jpg)
pak help china
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హిందువుల ఊచకోత తర్వాత, భారత్ .. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించడం, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇవి పాకిస్తాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఏ క్షణమైనా భారత్ తో యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.
పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. ఒకవేళ భారత్ తో యుద్దం సంభవిస్తే సహాయం చేయాలని కోరారు. అందుకు చైనా కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ వెల్లడించారు. భారత్ తమపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఉగ్రవాద దాడిపై నిష్పాక్షిక దర్యాప్తుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన ఈ ఊచకోతలో, 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.