Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 32 మంది

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Mahbubnagar road accident

Mahbubnagar Road Accident

ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు లక్షలాది మంది జీవితాలను బలి తీసుకుంటుంది. కేవలం ఒక నిమిషంలో ఎన్నో జీవితాలను తలకిందులు చేస్తుంది. ఒక నిర్లక్ష్యమైన క్షణం లేదా ఒక చిన్న తప్పిదం వల్ల ఓ కుటుంబం క్షణాల్లో ఛిద్రమైపోతుంది. ఈ ప్రమాదాలు కేవలం ప్రాణాలను తీయడమే కాకుండా.. శారీరక, మానసిక, ఆర్థికంగా సమాజాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు దేశవ్యాప్తంగా విషాదం నింపుతున్నాయి. అతివేగం, అజాగ్రత్త, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు. ప్రతిరోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఈ సంఖ్యను మరింత పెంచుతున్నాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల్లో మార్పు రావాలి. ఈ ఘోర విషాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.  

బస్సు వేగంగా వచ్చి..

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అడ్డాకుల మండలం కాటవరం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు వేగంగా వచ్చి ఒక్కసారిగా లారీని ఢీకొనడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మెట్రో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..!

స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతుల కుటుంబాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దుర్ఘటనతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో వారికి కోల్పోవటంతో.. కుటుంబ సభ్యులు, బంధువు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇది కూడా చదవండి: వీడసలు మనిషేనా.. తాగుడుకు డబ్బులివ్వలేదని మిక్సీ వైరుతో భార్యను చంపిన భర్త

Advertisment
తాజా కథనాలు