/rtv/media/media_files/2025/09/01/husband-kills-wife-with-a-mixer-wire-2025-09-01-09-22-21.jpg)
Husband kills wife with a mixer wire
Crime: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను అతికిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని భార్య గొంతుకు మిక్సీ వైరు బిగించి హత్య చేశాడు.ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో కలకలం రేపింది. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న రామకృష్ణ, తన భార్య త్రివేణిని మిక్సీ వైరు సహాయంతో హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వారి చిన్న కుమారుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI
మన్యం జిల్లా మక్కువ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన త్రివేణి, పార్వతీపురం మండలం బందలుప్పి గ్రామానికి చెందిన రామకృష్ణలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరు సాలూరు పట్టణం దుగ్గాన వీధిలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య, మహేందర్ ఉన్నారు. రామకృష్ణ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండగా త్రివేణి కూలి పనులు చేసుకుంటుంది. ఇద్దరు కలిసి కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇద్దరికీ పనులు లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. అయితే మద్యం తాగే అలవాటు ఉన్న రామకృష్ణ మద్యం కోసం త్రివేణిని డబ్బులు అడిగాడు. అయితే త్రివేణి తన దగ్గర డబ్బులు లేవని తాగడానికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇరువురు మధ్య మొదట మాట మాట పెరిగి అది ఘర్షణ కు దారితీసింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన రామకృష్ణ ఇంట్లో ఉన్న మిక్సీ వైరు తీసుకొని త్రివేణి మెడకు చుట్టి బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తరువాత ఏం తెలియనట్టే ఉన్నాడు . అయితే కొద్దిసేపటి తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు మహేందర్ తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. ఏమి జరిగిందని తండ్రిని అడిగాడు. దీంతో మీ అమ్మ గుండెపోటుతో పడిపోయిందని తెలిపాడు. ఈ విషయాన్ని గొల్లవీధిలో ఉన్న నీ పెద్దమ్మకు చెప్పి రా అని కొడుకును పంపించాడు రామకృష్ణ. ఆ తర్వాత కొద్ది సేపటికే త్రివేణిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిక్షీంచిన వైద్యలు అప్పటికే ఆమె మరణించినట్లు ధృవీకరించారు.
Also Read: 3 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. కట్ చేస్తే నదిలో మృతదేహం
త్రివేణి మరణంచిందని తెలియగానే రామకృష్ణ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నకొడుకు మహేందర్ ఈ విషయం తన అన్న ఆదిత్యకు ఫోన్ ద్వారా తెలిపి అనంతరం బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.