ఇవాళ కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఆయనతో పాటే మరికొందరికి కాంగ్రెస్ కండువా..!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు నేతలు ఇవాళ(ఆగస్టు 2) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీవర్ధన్ ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.