తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (Telangana High Court)చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. హైదరాబాద్కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్ పిటిషన్పై బుధవారం జస్టిస్ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్చ ఉన్నట్లుగానే తమకు నమ్మకం లేని మతాన్ని విశ్వసించని హక్కు కూడా ఉంటుందని తెలిపింది. ఇది భావప్రకటన స్వేచ్ఛలో భాగం కాబట్టి పిటిషనర్లు కోరినట్లుగా ‘బర్త్ సర్టిఫికేట్’ (Birth Certificate) లో కుల రహిత, మత రహిత’ కాలాన్ని పొందపరచాలని…దీని కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.
పూర్తిగా చదవండి..No Caste, No Religion : తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు..!!
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. హైదరాబాద్కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్ పిటిషన్పై బుధవారం జస్టిస్ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించింది.
Translate this News: