కృష్ణానదిలో సాయిచంద్‌ అస్తికల నిమజ్జనం

తెలంగాణ ఫోక్ సింగర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం అందరిని షాక్‌కు గురి చేసింది. ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఆ పాట కోట్ల మందిని కదిలించింది. జానపదాన్ని నింపుకుని జనం గొంతుకై నిలిచిన పాట ఊరూవాడా ప్రతిధ్వనించింది. సొంతంగా రాసి.. బాణీకట్టి.. గజ్జెకట్టి ఆడుతుంటే యావత్‌ తెలంగాణ ఉద్వేగంతో ఊగిపోయింది.

New Update
కృష్ణానదిలో సాయిచంద్‌ అస్తికల నిమజ్జనం

Jogulamba Gadwal Immersion of Saichand ashes in Krishna river

సాయిచంద్‌ తీరు చాలా ప్రత్యేకం

ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన కళాకారులు చాలా మందే ఉన్నా.. సాయిచంద్‌ తీరు చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. అందుకే ఆయన మరణవార్త తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తోంది. కళాకారుల హృదయాలన్నీ బరువెక్కిపోయాయి. గులాబీ పార్టీతో సాయిచంద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే.. ఆయన మరణ వార్త తెలియగానే పార్టీ ముఖ్యనేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Jogulamba Gadwal Immersion of Saichand ashes in Krishna river

సీఎం కేసీఆర్ భరోసా..

తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేస్తూ అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే సాయిచంద్‌ దశదిన కర్మ కార్యక్రమంలో నిన్న సీఎం కేసీఆర్ పాల్గొని, నివాళులార్పించిన విషయం తెలసిందే. ఆదివారం హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొని సాయిచంద్‌ చిత్రపటానికి పూలు చల్లి, శ్రద్ధాంజలి ఘటించారు. సాయిచంద్‌ తండ్రి వెంకట్రాములు, భార్య రజిని, కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. పుట్టేడు దుఖఃలో ఉన్న కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయిచంద్‌ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు.

Jogulamba Gadwal Immersion of Saichand ashes in Krishna river

కవిత చూసి బోరున విలపించిన రజిని

సాయిచంద్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కేటీఆర్‌, బీఆర్‌ఎస్ నేతలందరూ వరసగా పరామర్శించిన విషయం తెలిసిందే. సాయిచంద్ నివాసానికి వెళ్లగానే కవితను చూసి సాయిచంద్ భార్య బోరున విలపించింది. వారిని ఓదార్చే క్రమంలో కవిత సైతం భాగోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే సాయిచంద్ మరణించడం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఎంతోమందిని చైతన్యవంతం చేశారని పేర్కొంది. మా అందరికీ ఆత్మీయుడు చనిపోయాడని వార్త జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. సాయిచంద్ మరణం తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ నేతులందరూ హామీ ఇచ్చి.. రజినికి పార్టీలో కీలక పదవి ఇచ్చారు.

Jogulamba Gadwal Immersion of Saichand ashes in Krishna river

సాయిచంద్‌ అస్తికల నిమజ్జనం

కృష్ణమ్మ నదిలో సాయిచంద్‌ అస్తికల నిమజ్జనం జరిగింది. ఈనెల 29న గుండెపోటుతో సింగర్‌ సాయిచంద్‌ మరణించిన విషయం తెలిసిందే. దాంతో సాయిచంద్‌ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వాళ్ళ అస్తికలను పవిత్ర నదీ జలాలలో కలపడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఆ సంప్రదాయం ప్రకారం భర్త సాయిచంద్‌ అస్తికలను తీసుకొని జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి సమీపంలోని కృష్ణానదికి చేరుకుకున్న భార్య రజిని.. కృష్ణమ్మ నదిలో భర్త అస్తికలను నిమజ్జనం చేశారు. సాయిచంద్‌ అస్తికలను కృష్ణమ్మ నదిలో నిమజ్జనం చేయడానికి భార్యతో పాటు కుమారుడు చరీష్‌, కుటుంబ సభ్యులు అస్తికలు కలిపిన అనంతరం పూజలో పాల్గొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు