సర్కారు దవాఖానలో రికార్డు.. ఒకే రోజు 44 మంది శిశువుల జననం

తల్లి అవ్వడం అనేది ఓ పెద్ద వరం. ఒక శిశువుకి జన్మనివ్వడం అనేది నిజంగా గొప్ప వరమే అని చెప్పాలి. మాతృత్వంలో మాధుర్యాన్ని అందుకోలేని వాళ్లు అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఈ పద్ధతినే సరోగసీ అంటారు. అయితే మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో డెలివరీలు చేశారు డాక్టర్లు. దీంతో ఆస్పత్రిలో ప్రసవవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్‌, కేసీఆర్‌ కిట్‌తో పాటు అమ్మఒడితో ప్రభుత్వాస్పత్రిల్లో కాన్పులు అధికంగా పెరిగాయి.

New Update
సర్కారు దవాఖానలో రికార్డు.. ఒకే రోజు 44 మంది శిశువుల జననం

తల్లీబిడ్డలు క్షేమం

మహబూబ్‌నగర్‌ జిల్లా మెట్టుగడ్డలో ఆగస్టు 5 (నిన్న) ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్‌, కేసీఆర్‌ కిట్‌తోపాటు అమ్మఒడితో కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్‌ దవాఖానలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు కాకుండా గర్భిణులు సర్కారు దవాఖానల్లో వైద్య సేవలకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానలకు మహిళలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖానకు ఆదరణ పెరిగింది.A record number of babies were born in Mettugadda Government Hospital of Mahbubnagar District రికార్డు స్థాయిలో ప్రసవాలు

ఉమ్మడి జిల్లా నుంచి గర్భిణులు ప్రసవాల కోసం ఇక్కడికి వస్తున్నారు. రికార్డు స్థాయిలో 24 గంటల్లో (ఒకే రోజు) 44 ప్రసవాలు జరిగాయి. 3న గురువారం అర్ధరాత్రి 12 నుంచి 4వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పదుల సంఖ్యలో ప్రసవాలు జరిగాయి. ఇందులో 21 మందికి ఆపరేషన్లు, 23 మందికి సాధారణ ప్రసవాలు జరగగా.. 19 మంది ఆడబిడ్డలు, 25 మంది మగబిడ్డలు జన్మించారు. తల్లులు, శిశువులు క్షేమంగా ఉన్నారని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ తెలిపారు. గైనిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాధ పర్యవేక్షణలో డాక్టర్లు లక్ష్మీపద్మప్రియ, సరిత, స్ఫూర్తి, సింధూర, ధ్రువిత, అపురూప, నాగ ప్రవళిక, జ్యోతిర్మ యి వైద్యసేవలు అందిస్తున్నారు.

మెరుగైన వైద్య సేవలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వరకు మౌలిక సదుపాయాలు, వసతులు పెంచి, వాటి రూపురేఖలని మార్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు మెరుగయయాయి. దీంలో ప్రతి ఒక్కరు వైద్యానికి ప్రభుత్వ దవాఖానాకు వస్తున్నారు. మహిళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ప్రసూతి అయిన తల్లీ బిడ్డలకు కెసిఆర్‌ కిట్లు ఇస్తున్నారు. బిడ్డకు బేబీ సోప్స్‌, బేబీ ఆయిల్‌, బేబీ పౌడర్‌, రెండు బేబీ డ్రెస్సులు, టవళ్లు, దోమతెర, తల్లికి రెండు చీరలు ఇతరత్రా 15 రకాల వస్తువులతో కలిపి కేసీఆర్‌ కానుకగా అందుతున్నాయి. గర్బిణీలకు గర్భం దాల్చిన నాటి నుండే ఉచిత పరీక్షలు చేయిస్తూ, ప్రభుత్వ దవాఖానాల్లో సుఖ, సహజ ప్రసవాలు జరిగే విధంగా చూస్తున్నారు. మగ పిల్లాడు పుడితే రూ.12వేలు, ఆడ పిల్ల పుడితే రూ.13 వేలను నాలుగు విడతలుగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు రెండున్నర లక్షల కిట్స్‌ని  బీఆర్ఎస్‌ ప్రభుత్వంపంపిణీ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు