/rtv/media/media_files/2025/07/27/9-people-arrested-at-rave-party-in-kondapur-2025-07-27-11-44-29.jpg)
9 people arrested at rave party in Kondapur
కొండాపూర్ లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్ మెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొన్ని ముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న స్టేట్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బిటీం ఎస్సై సంధ్య, బాలరాజు ఇతర సిబ్బంది కలిసి దాడి చేసి భగ్నం చేశారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా మారుపేర్లతో మరో బ్యాంక్ అకౌంట్ తో, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న బడాబాబులను నగరానికి తీసుకువచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళుతుంటారనే విషయం వెలుగు చూసింది.
Also Read: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!
Kondapur Rave Party
వీకెండ్ వచ్చిందంటే చాలు సర్వీస్ అపార్ట్మెంట్లలో మద్యం విందులు, డ్రగ్స్ వినియోగాలు, అమ్మాయిలు, డాన్సులు.. ఇలా ఇంకెన్నో కొండాపూర్ ఏరియాలో జరుగుతున్నాయి. పోలీసులు, సంబంధిత అధికారులు ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా వారి ఆగడాలు ఆగడంలేదు.కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. వీకెండ్ సందర్భంగా ఏపీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బిటీం ఎస్సై సంధ్య, ఇతర సిబ్బంది కలిసి దాడి చేశారు. అందరిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
పోలీసుల దాడిలో 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ అయ్యాయి. ఈ రేవ్ పార్టీలో 9 మందిని అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు కార్లు, 11 సెల్ ఫోన్లను సీజ్ చేసి.. 9 మందిని అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో కింగ్ కెన్ షేర్, డ్రగ్స్ సరఫరాదారు రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అశోక్ కుమార్, ఆర్గనైజర్ సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమార స్వామి, అడపా యశ్వంత్ శ్రీ దత్, సమత, తేజలు ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇంకెవరి హస్తమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?
Also Read : స్టాండింగ్ డెస్క్ ఉపయోగించడం ద్వారా డయాబెటిస్‌పై సహజ నియంత్రణ
task-force-dcp | ganja-seized | ganja | andhraparadesh | rave-party