/rtv/media/media_files/2025/07/13/irctc-package-2025-07-13-16-45-28.jpg)
IRCTC Package
దేశంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని లైఫ్‌లో ఒక్కసారైనా కూడా చూడాలని భావిస్తారు. అయితే ఒక్కో పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి కష్టం. అన్నింటిని కూడా ఒక ట్రిప్‌లో పూర్తి చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్య క్షేత్రాలైన అయోధ్యతో పాటు దాని చుట్టూ ఉన్న ఆలయాలను సందర్శించాలని భావిస్తారు.
ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!
జులై 25వ తేదీ నుంచి..
అలాంటి వారికి ఐఆర్‌సీటీసీ బెస్ట్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో మొత్తం 17 రోజుల్లో 30 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ యాత్ర జులై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో అయోధ్యతో పాటు వారణాసి, ప్రయాగ్‌రాజ్, నాసిక్, రామేశ్వరం వరకు ఈ టూర్ ఉంటుంది. మొత్తం 150 మంది ప్రయాణికులతో భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌లో యాత్రకు తీసుకెళ్తారు.
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
ఈ యాత్రకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1,15,180 ఛార్జ్ చేస్తారు. ఈ ప్యాకేజీలో ఏసీ 3 టైర్‌లో హోటల్ గదుల్లో ట్రిపుల్ షేర్ అయితే రూ.1,15,180, డబుల్ షేర్ అయితే రూ.1,17,975, సింగిల్ షేర్ అయితే రూ.1,37,545 ఛార్జ్ చేస్తారు. అదే ఏసీ 2 టైర్ అయితే ట్రిపుల్ షేర్‌లో రూ.1,37,325, డబుల్ షేర్ రూ.1,40,120, సింగిల్ షేర్ అయితే రూ.1,59,690 అవుతుంది.
ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?
ఏసీ 1 టైర్ అయితే రూ.1,63,585 కి ట్రిపుల్ షేర్, డబుల్ షేర్ అయితే రూ.1,66,380, సింగిల్ షేర్ అయితే రూ.1,85,950 అవుతుంది. అదే 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు టికెట్ ధర అయితే రూ.1,07,615 ఐఆర్‌సీటీసీ తీసుకుంటుంది.