Kodangal : వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో ఊహించని అంశాలను బటయపెట్టారు పోలీసులు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని A1- బోగమొని సురేష్, A2- దేవదాస్, A4- గోపాల్ నాయక్ , A5- విజయ్, A6- విఠల్, A7- లోక్యనాయక్ పై కేసులు పెట్టారు. వీరిపై అటెంప్ట్ మర్డర్ తోపాటు మొత్తం 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో 16 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 30 మందికోసం 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : ఏమి యాక్టింగ్ బాబు.. ఎన్టీఆర్‌ని మించిపోయింది: జగన్ సంచలన వ్యాఖ్యలు
Also Read : ఇలాంటి బంగాళాదుంప తింటే ఏమవుతుందో తెలుసా..!అస్సలు ఊహించలేరు
పక్కా ప్లాన్ ప్రకారమే దాడి..
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన డీఎస్సీ.. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారని చెప్పారు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను లగచర్లకు రావాలని కోరాడు. అభిప్రాయ సేకరణ కోసం ఘటన జరిగిన రోజున ఉదయం 11 గంటలకు అడిషనల్ కలెక్టర్ లింగయ్య, తాండూరు ఇంఛార్జ్ కలెక్టర్ ఉమాశంకర్, తహసీల్దారు కిషన్ నాయక్, విజయ్ కుమార్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి లగచర్లకు వెళ్లారు. ఈ క్రమంలోనే రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకుని, అధికారులు రాగానే దాడి చేయాలని సురేష్ ముందస్తు ప్లాన్ వేశాడు. ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!
Attack On Collectors.pdf
నాన్ బెయిలబుల్ కేసులు..
ఇక పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్‌లో నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. క్రైం నెంబర్ 153/2024 ప్రకారం.. కేసు సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు ఫైల్ అయ్యాయి. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసినట్లు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొత్తం 46మందిని నిందితులుగా చేర్చామని, ఎఫ్‌ఐఆర్‌లో బోగమోని సురేష్ ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా?