/rtv/media/media_files/2024/11/13/sproutedpotato41.jpeg)
ప్రతీ ఇంట్లో బంగాళాదుంపను రకరకాల వంటకాల తయారీకి ఉపయోగిస్తారు. సాంబార్, కుర్మా, ఫ్రై, కర్రీ ఇలా బంగాళాదుంపతో డిఫరెంట్ ఐటమ్స్ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో బంగాళాదుంపల పై మొలకలు వస్తాయి. కొంతమంది వీటి ప్రభావం గురించి తెలియక తినేస్తూ ఉంటారు.
/rtv/media/media_files/2024/11/13/sproutedpotato51.jpeg)
అయితే మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. వీటిని అలాగే వండుకొని తినడం ద్వారా కళ్ళు వాపులు, వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2024/11/13/sproutedpotato21.jpeg)
బంగాళాదుంపలు 68 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు మొలకెత్తుతాయి. మొలకెత్తిన బంగాళాదుంపలో సాధారణ వాటి కంటే పోషక విలువల శాతం తక్కువగా ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/13/sproutedpotato11.jpeg)
మొలకెత్తిన బంగాళాదుంపల్లో గ్లైకోఅల్కలాయిడ్స్ అనే సహజ విషపూరిత సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని సోలనిన్, చాకోనిన్ గ్లైకోఅల్కలాయిడ్స్ గా పిలుస్తారు.
/rtv/media/media_files/2024/11/13/sproutedpotato61.jpeg)
గ్లైకోఅల్కలాయిడ్స్ అనే విషపూరితాల సమ్మేళనాలు కలిగిన ఈ బంగాళదుంపలను తినడం ద్వారా వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వస్తుంది. అంతేకాదు తల నొప్పి సమస్య కూడా తలెత్తుతుంది.
/rtv/media/media_files/2024/11/13/t5asvkrrPGN2Ue3wAIAu.jpg)
ముఖ్యంగా మధుమేహ రోగులకు ఇవి చాలా హానికరం. వీటిని తినడం ద్వారా రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి బంగాళాదుంపలను తీసుకోకపోవడం మంచిది.
/rtv/media/media_files/2024/11/13/sproutedpotato21.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.