ఏమి యాక్టింగ్ బాబు.. ఎన్టీఆర్‌ని మించిపోయింది: జగన్ సంచలన వ్యాఖ్యలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై మాట్లాడారు. చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్‌లో తెలిసిపోయిందని అన్నారు. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారని ప్రశ్నించారు. By Seetha Ram 13 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై మాట్లాడారు. చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్‌లో తెలిసిపోయిందని అన్నారు. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు అబద్దాలు, మోసాలు బయటపడతాయని భయపడ్డారని అన్నారు. Also Read : కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు! బాబు యాక్షన్ ఎన్టీఆర్‌ను మించిపోయింది అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు నిలదీస్తారని భయపడ్డారని పేర్కొన్నారు. ఇంత కాలానికి ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 పథకాలను ఎగ్గొట్టాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బాబు యాక్షన్ చూస్తుంటే దానవీర శూరకర్ణలోని ఎన్టీఆర్ నటనను మించిపోయారన్నారు. గతంలో తమ ప్రభుత్వం విఫలం కావాలనేది టీడీపీ ఉద్దేశమన్నారు. అంతేకాకుండా పరిమితికి మించి అప్పులు చేశామని తప్పుడు ప్రచారం చేశారన్నారు. శ్రీలంక పరిస్థితిలా ఏపీ రాష్ట్రం అవుతుందని దత్తపుత్రుడు ట్వీట్ చేశారని విమర్శించారు. అప్పుల విషయంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఒక పద్దతి ప్రకారం తమ ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు రాకూడదని ఏజెన్సీలకు లేఖలు కూడా రాశారని తెలిపారు. Also Read : రేషన్ మాఫియాపై ఉక్కుపాదం.. 1010 క్రిమినల్ కేసులు నమోదు! ఇచ్చిన హామీలను వైసీపీ హయాంలో తూచా తప్పకుండా అమలు చేశాం అని తెలిపారు. గత ఐదేళ్లలో 6.31 లక్షల ఉద్యోగాలిచ్చామని.. అయితే చంద్రబాబు వచ్చాక 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారన్నారు. అంతేకాకుండా రూ. 2 లక్షల 73 వేల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెప్పుకొచ్చారు. అవి మాత్రమే కాకుండా 15వేల మంది బేవరేజెస్ ఉద్యోగులను కూడా తొలగించారన్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ.15 వేలు ఇస్తానన్నారని.. కానీ బడ్జెట్‌లో రూ. 13 వేల కోట్లు ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుదేలైందని ఆరోపించారు. అంతేకాకుండా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులిచ్చారని అన్నారు. అందులో 147 మందిపై కేసులు పెట్టారని.. 49 మందిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. #cm-chandra-babu #jagan-mohan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి