/rtv/media/media_files/2025/05/01/utUho7hfT0k5vkrO3lLz.jpg)
sri varshini and aghori
ఈ మధ్య కాలంలో లేడీ అఘోరి, వర్షిణి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు కూడా. అంతేకాకుండా పెళ్లి వీడియోలను సైతం సోషల్ మీడియాలో లైవ్‌లో చూపించారు. అనంతరం నేనే అఘోరీ మొదటి భార్యను అంటూ రాధిక అనే మహిల మీడియా ముందుకు వచ్చింది. ఆపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. అదే సమయంలో ట్రాన్స్ జెండర్స్ యూనియన్లు సైతం పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. దీంతో వర్షిణిని పెళ్లి చేసుకుని పారిపోయిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని అరెస్టు చేశారు.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
బాయ్‌ఫ్రెండ్‌తో శ్రీవర్షిణి
ప్రస్తుతం అఘోరీ చంచల్ గూడ జైల్లో 14 రోజుల రిమాండ్‌లో ఉంది. వర్షిణిని కూడా తనతో పాటే ఉంచాలని జైల్లో గొడవ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వర్షిణికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. శ్రీ వర్షిణికి గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు ఆ వీడియోల్లో రివీల్ అయినట్లు తెలుస్తోంది. ఆ బాయ్ ఫ్రెండ్‌తో గతంలో శ్రీవర్షిణి రొమాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
వాళ్లు ఎన్నో పార్కులు, బీచ్‌లు, హోటళ్లకు వెళ్లినట్లు ఆ వీడియోల్లో తెలుస్తోంది. అయితే గతంలో వాళ్లు కలిసి తిరిగిన వీడియోలు ఇప్పుడు ఎలా బయటికొచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఇప్పుడు ఆ వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
ఇదిలా ఉంటే అఘోరీ అంటే తనకు ఇష్టమని.. తాను అఘోరీతోనే ఉంటానని శ్రీవర్షిణి చెప్పినప్పుడు చాలా మంది ఆమెను అమాయకురాలిగా భావించారు. అంతేకాకుండా అఘోరీతో వెళ్లొద్దంటూ వర్షిణీకి సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం వర్షిణి బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న వీడియోలు బయటకు రావడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? వర్షిణి అఘోరీని ఎందుకు పెళ్లి చేసుకుంది..? అన్న దానిపై నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
latest-telugu-news | telugu-news | aghori news | lady aghori