Madava Rao: కవిత కుక్క పేరు కూడా విస్కీ.. BRS MLA సంచలన ఆరోపణలు

తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఇటీవల కూకట్‌పల్లిలో నిర్వహించిన 'జన జాగృతి' పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

New Update
kavitha

తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత(kavitha) ఇటీవల కూకట్‌పల్లిలో నిర్వహించిన 'జన జాగృతి' పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే(kukatpally MLA) మాధవరం కృష్ణారావు(mla madhavaram krishna rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

గౌరవం లేదు, చరిత్ర హీనురాలు:

కవితకు హైదరాబాద్(hyderabad) ఎమ్మెల్యేలపై కనీస గౌరవం లేదని, ఆమె మాట్లాడే అర్హత లేని చరిత్ర హీనురాలు అని మాధవరం కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం తాము కలిసి నడిస్తే, తమను బీటీ (బందిపోట్ల) బ్యాచ్ అని నిందించడం సరికాదన్నారు. తామంతా తెలంగాణ కోసం పని చేశామని స్పష్టం చేశారు.

Also Read :  సావుకొచ్చిన సర్పంచ్ పదవి.. అభ్యర్థుల ఆ*త్మహత్యలు

వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు:

కవిత చరిత్ర అంటే మద్యం (లిక్కర్) చరిత్రేనని, ఆమె ఇంట్లోని కుక్క పేరు కూడా విస్కీ అని ఎద్దేవా చేశారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, "నీలాంటి కుక్కలు చాలా మంది ఇక్కడికి వచ్చి మొరిగి పోయారు" అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. కవిత బండారం బయటపెడితే తెలుస్తుందని, ఆమె ఏ బంగారం షాపును వదలలేదని ఆరోపించారు.

కుటుంబ వ్యవహారాల్లో జోక్యం:

కవిత భర్తపై కూడా మాధవరం ఆరోపణలు చేశారు. కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని, కేసీఆర్ పేరు చెప్పుకుని ఓవర్‌ల్యాప్ భూములను క్లియర్ చేసుకున్నారని విమర్శించారు. అంతేకాక, "హరీష్ రావును పార్టీ నుండి వెళ్లగొట్టాలి, కేటీఆర్‌ను అరెస్టు చూపించాలి, దోచుక తినాలి అన్నదే కవిత ప్లాన్" అంటూ పార్టీ అంతర్గత విషయాలను ప్రస్తావించారు.

హెచ్చరికలు, సవాళ్లు:

కవిత వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఆమె తట్టుకోలేరని హెచ్చరించారు. "నీ చిట్టా నా దగ్గర ఉంది. పెద్దాయన (కేసీఆర్) కోసం ఊరుకుంటున్నాను. మర్యాదగా మాట్లాడు" అని స్పష్టం చేశారు. పదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం కవిత ఉంటున్న ఇల్లు సీఎం రేవంత్ రెడ్డికి కూడా అంత పెద్దది లేదని ఎత్తి చూపారు.

చివరగా, ఇంకోసారి తమ పార్టీపైన, ఎమ్మెల్యేలపైన మాట్లాడితే ఊరుకునేది లేదని, హైదరాబాద్ ప్రజలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని మాధవరం కృష్ణారావు గట్టిగా హెచ్చరించారు.

Also Read :  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్.. ఫస్ట్ రోజే రూ.3,97,500 కోట్ల పెట్టుబడులు

Advertisment
తాజా కథనాలు