KTR: కేటీఆర్ బంధువు హోటల్‌పై పోలీసుల దాడి.. 35 మంది ఒకేసారి!

మాజీ మంత్రి కేటీఆర్ మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువుకు చెందిన హోటల్ సెరాయ్ గ్రాండేలో డ్రగ్స్, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు దాడులు చేశారు. అయితే అక్కడ ఏమీ దొరకలేదని సమాచారం.

New Update
ktr acb

BRS MLA KTR

KTR: మాజీ మంత్రి కేటీఆర్ మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువుకు చెందిన ఓ హోటల్‌పై పోలీసులు మెరుపు దాడి చేశారు. గచ్చిబౌలిలోని హోటల్ సెరాయ్ గ్రాండేలో ఒకేసారి 35 మంది నార్కోటిక్ టీమ్స్, SOT పోలీసులు గోడలు దూకి, ఎంట్రీ, ఎగ్జిట్‌వే నుంచి సినిమా సీన్ తరహాలో హోటల్ లోపలికి ప్రవేశించారు.

డ్రగ్స్, చట్ట విరుద్ధ కార్యకలాపాలు..

హోటల్‌లో డ్రగ్స్, ఇతరత్రా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు హెటల్‌లో రూమ్స్ బుక్ చేసుకుని ఉన్న టూరిస్టులు, కస్టమర్లను కూడా తనిఖీ చేశారు. అయితే అక్కడ ఏమీ దొరకకపోవడంతో పోలీసులు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ఇది కూడా చదవండి: Sajjanar: పెళ్లి పేరుతో న్యూడ్ వీడియో కాల్స్.. మ్యాట్రిమోనితో జాగ్రత్త

ఇదిలా ఉంటే.. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్‌ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ ఘటనతో హైదరాబాద్ లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడిందన్నారు.

అయితే ఈ ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజా ధనానికి నష్టం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఇలా తొక్కిపెట్టడం దారుణమన్నారు. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోందని ఆరోపించారు. ఈ సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్లేనన్నారు.

ఇది కూడా చదవండి: AP: తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి.. 13ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు