AP: తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి.. 13ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే!

తల్లి ఫోన్‌లో నీలి చిత్రాలు చూసిన 13ఏళ్ల బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏపీ ఏటికొప్పాక గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి 5ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. నిందితుడి కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారికి వైద్య పరీక్షలు చేయించారు.

New Update
Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే!

Sexually assaulted 13year old boy on 5yearold girl In AP

AP: ఏపీలో మరో దారుణం జరిగింది. మొబైల్‌లో వీడియోలు చూస్తూ ఓ బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. గేమ్స్ ఆడుకుంటానంటూ తల్లి ఫోన్ తీసుకున్న 13 ఏళ్ల అబ్బాయి నెమ్మదిగా పక్కదారి పట్టాడు. ఫోన్‌లో ఆకర్షిణీయమైన అమ్మాయిల ఫొటోలు చూసి పలు లింక్ లు క్లిక్ చేశాడు. అలా ఒక్కో లింక్ ఓపెన్ చేస్తుండగా చివరికి పోర్న్ వీడియో తన కంటపడింది. అంతే ఇక అదే అదనుగా గంటల తరబడి నీలి చిత్రాలు చూడటం మొదలుపెట్టాడు. అలా రోజుల తరబడి తల్లి ఫోన్ తీసుకోవడం శృంగార చిత్రాలు చూస్తుండగా అతనికి అలా చేయాలనే కోరిక కలిగింది. దీంతో తన ఇంటి దగ్గరలోని ఓ చిన్నారిపై కన్నేశాడు. ఎవరు గమనించకముందు ఆ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన అనకాపల్లిలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామంలో టీడీపీ వార్డు సభ్యురాలి కొడుకు (13) స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే తల్లి మొబైల్ లో పోర్న్ చూసి 5ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లగానే రక్తస్రావం కావడంతో విషయం గమనించిన బాలిక తల్లిదండ్రుల పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని విచారిస్తున్న క్రమంలో తల్లి ఫోన్ లో నీలి చిత్రాలు చూసిన తర్వాత తనకు అలా చేయాలని కోరిక కలిగిందని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలికను విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: TG: కౌశిక్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్న పోలీసులు.. పీడీ యాక్ట్ కేసు, రెండ్రోజుల్లో అరెస్ట్

బాలిక కుటుంబాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ పరామర్శించారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్న ఆయన.. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: తగ్గిపోతున్న బ్రాహ్మణుల జనాభా.. కీలక నిర్ణయం తీసుకున్న కమ్యునిటీ బోర్డు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు