KTR: అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకో రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారనీ కేటీఆర్ ఆరోపించారు. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 22 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఈ వ్యవహారం వెలుగుచూసిందన్నారు. తెలంగాణలో కూడా అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సహకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. Also Read: ఆర్జే వెంచర్స్ రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ KTR : Adani - Revanth '' బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అదానీ గ్రూప్ తెలంగాణకు రాలేదు. కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియకుండానే రేవంత్ అదానికి రెడ్ కార్పెడ్ పరిచారా ?. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు అదానీకి అప్పగించేందుకు రేవంత్ ప్రయత్నించారు. స్కిల్ యూనివర్సిటీకి ఆయన రూ.100 కోట్ల విరాళం అందించారు. వ్యాపారవేత్తలు రూ.40 వేల కోట్ల విరాళాలు ఉచితంగా ఇవ్వరని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీకి ఓ జాతీయ విధానం ఉండాలి. Also Read : ఏపీ పీఏసీ చైర్మన్ చైర్మన్ గా రామాంజనేయులు.. సభ్యులు వీరే! అదానీతో చేసుకున్న ఒప్పందాలను ఇప్పుడు కెన్యా కూడా రద్దు చేసుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలని'' కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా.. అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం రాజకీయాల్లో పాటు వ్యాపార రంగాల్లో సంచలనం రేపుతోంది. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు అదానీ గ్రూప్.. ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారులకు 265 మిలియన్ డాలర్లు(రూ.2,238 కోట్లు) లంచం ఇవ్వజూపినట్లు న్యూయార్క్‌లో ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. Also Read: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్ ఈ వ్యవహారంపై గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. యూఎస్ కోర్టు అరెస్టు వారెంటు కూడా జారీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా వైట్ హౌస్ కూడా స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. Also Read : ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్! #adani #telangana #telugu-news #ktr #revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి