RJ Ventures రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ హైదరాబాద్‌లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్‌కు పాల్పడింది.నగర శివార్లలోని అపార్ట్‌మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని 600 మంది నుంచి రూ. 150 కోట్లు వసూలు చేసింది. చివరికీ ఇప్పడు బోర్డు తిప్పేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్‌కు పాల్పడింది. ఏకంగా 600 మంచిని మోసం చేయడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నగర శివార్లలోని అపార్ట్‌మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని ఆర్జే వెంచర్స్ లక్షల్లో వసూలు చేసింది. ఘట్‌కేసర్, నారాయణ్‌ఖేడ్, పటాన్ చెరువు, కర్దనూర్ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్, ఫార్మ్‌ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్.. ప్రముఖులతో కలిసి అడ్వర్టైస్‌మెంట్స్ చేశారు. Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 600 మంది డబ్బులు వసూలు చేశారు. రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కట్టించుకున్నారు. చివరికి ఆర్జే వెంచర్స్ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. తాము డబ్బులు కట్టి నాలుగేళ్లయినా కూడా ఇప్పటిదాకా ఎలాంటి నిర్మాణాలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read: కేసీఆర్ ఫ్యాన్స్ కు ఇక పండగే.. ఆ సినిమాలో గులాబీ బాస్ స్పెషల్ రోల్! RJ Ventures ఆర్జే వెంచర్స్ ఎండీ భాస్కర్ గుప్తు, డైరెక్టర్ సుధారాణిని నమ్మి ఈ 600 మంది దాదాపు రూ.150 కోట్లు కట్టారు. తమ ఇళ్ల నిర్మాణాలపై ఎన్నిసార్లు అడిగిన సమాధానాలు చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారని.. అవి కూడా బౌన్స్ అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై వారు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని.. ఫిర్యాదు అఖ్కడి పోలీస్ స్టేషన్‌లో చేయాలని అధికారులు వాళ్లకి సూచించారు. Also Read: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ? Also Read : Skin Care: త్వరలో పెళ్లి జరగబోతోందా.. చర్మాన్ని ఇలా మెరిపించుకోండి #telangana #telugu-news #real-estate #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి