ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్! ఢిల్లీలో రోజు రోజుకూ వాయు కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఈ కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ప్రజలకు అనేక ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కునే ప్రమాదం ఉంది. By Archana 22 Nov 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి 1/8 దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. రానున్న కాలంలో ఢిల్లీలో గాలిని పీల్చడం కష్టంగా మారనుంది. గాలిలో వాయు నాణ్యత సూచీ 400కి పైగానే నమోదవుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ మెసులుబాటు కల్పించారు. 2/8 ఇలాంటి పరిస్థితుల్లో మిమల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ప్రజలు శ్వాస సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది. అందుకని శరీర రోగనిరోధక శక్తి, శ్వాస వ్యవస్థను బలోపేతం చేయడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 3/8 అనులోమ, విలోమ్ అనులోమ, విలోమ్ యోగాసనం ఊపిరితిత్తులను బలపరుస్తుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందించడంలో ఈ ఆసనం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ 10-15 నిమిషాల పాటు అనులోమ- విలోమ్ ప్రక్రియను చేయడం ద్వారా ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తాయి. 4/8 వేప నీటితో స్నానం వేప నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం, జుట్టులో చేరుకుపోయిన కాలుష్యాలను తొలగించడంలో సహాపడుతుంది. వేప యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. వేప ఆకులను నీటిలో మరిగించి స్నానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. 5/8 ఉసిరి ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రోజూ ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధకశక్తితో పాటు శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది. అంతేకాదు కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. 6/8 ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక పురాతనమైన ఆయుర్వేద పద్ధతి. ఈ పద్దతిలో కొబ్బరి లేదా నువ్వుల నూనెను కొద్దిగా వేసుకొని 5 నిమిషాల పాటు పుక్కలిస్తారు. ఇలా చేయడం చిగుళ్లు, దంతాల చుట్టూ ఒక చిన్న ప్రొటెక్టివ్ లేయర్ ను సృష్టిస్తుంది. ఈ పొర కలుషితమైన గాలి, టాక్సిన్స్ నోట్లోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. 7/8 పసుపు పాలు ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఒక కప్పు పసుపు పాలు తీసుకోవడం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు శ్వాసకోస వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కలుషితమైన గాలి వల్ల గొంతులో కలిగే చికాకును దూరం చేస్తాయి. అలాగే పసుపు నీటితో గార్గల్ చేయడం గొంతులో మంటను తగ్గిస్తుంది. 8/8 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి