/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
గద్వాల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరబోనని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆనాడు అన్నారు, కాంగ్రెస్‌లో చేరాల్సివస్తే రైలుకింద తలపెడతానన్నారు. మరి ఈనాడు బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నారు. మరి బీఆర్ఎస్‌లోనే ఉంటే ఈ రోజు ఈ సభకు ఎందుకు రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. 6 నుంచి 9 నెలల్లో గద్వాలలో ఉప ఎన్నిక రావడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.
KTR throws a challenge to CM Revanth Reddy: face bypolls with defected MLAs and let people decide between 2 years of Congress rule vs 10 years of BRS rule. pic.twitter.com/BuebqLhrJr
— Naveena (@TheNaveena) September 13, 2025
ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉందని చెప్పారు. పార్టీ మారిన 10 మంది రాజీనామా చేయక తప్పదని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్‌కి దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు రావాలన్నారు. అప్పుడే కేసీఆర్ పదేళ్ల పాలన ఏంటో.. కాంగ్రెస్ 20 ఏళ్ల పాలన ఎంటో అందరికీ తెలుస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఏమన్నా రేషం ఉందా.. మీరే కదా ఆనాడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమన్నారు. ఇవాళ రాళ్లతో ఎవరిని కొట్టాలి.. ఆ ఇంటి మీద వాలిన కాకులు ఈ ఇంటి మీద వాలకూడదు అన్నారు.. ఈ పదిమంది కాకులు ఎటు కాకుండా పోయారు. ఒకటి స్త్రీలింగం ఉంటుంది, ఒకటి పులింగం ఉంటుంది.. వీళ్ళు ఏ లింగాలు అని కేటీఆర్ నిలదీశారు.
రైతులకు ఇచ్చే యూరియాను కాంగ్రెస్ దొంగ నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతులు ఎండలో ఎండి, వానలో తడిచి యూరియా కోసం కష్టాలు పడుతుంటే, ఈ కాంగ్రెస్ దొంగలు యూరియా బుక్కుతున్నారని మండిపడ్డారు. పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఫైరయ్యారు కేటీఆర్. గ్రూప్ 1 పోస్టుల్లో మొత్తం 563 ఉద్యోగాలు అమ్ముకున్నారని పిల్లలు అంటున్నారు.. ఒక్కొక ఉద్యోగం రూ.3 కోట్లకు దాదాపు రూ.1700 కోట్లకు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని కేటీఆర్ ఆరోపించారు.