SLBC టన్నెల్ ప్రమాదం.. కేటీఆర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

కొన్ని నెలల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన SLBC టన్నెల్‌ ప్రమాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేటీఆర్‌ స్పందించారు. సొరంగం కూలిన ప్రమాదం జరిగి 200 రోజులు గడిచినా కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని మండిపడ్డారు.

New Update
KTR Again responds on SLBC Tunnel Collapse incident

KTR Again responds on SLBC Tunnel Collapse incident

కొన్ని నెలల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన SLBC టన్నెల్‌ ప్రమాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన బీఆర్‌ఎస్‌ పార్టీ రేవంత్ సర్కార్‌పై విమర్శలు చేసింది. అయితే తాజాగా ఈ విషయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. సొరంగం కూలిన ప్రమాదం జరిగి 200 రోజులు గడిచినా కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని మండిపడ్డారు. 

Also Read: నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరుగురు మృతదేహాలు ఇప్పటికీ బయటకు తీయలేకపోయారంటూ ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందించలేదని ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలోని సమస్యలకు NDSA టీమ్‌ను పంపించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. SLBC ఘటనపై దర్యాప్తు కోసం ఒక్కో టీమ్‌ను ఎందుకు పంపించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్‌ను బీజేపీనే కాపాడుతోందని విమర్శించారు.

Also Read: చీరకొంగునే ఆయుధంగా మలిచి...నక్కతో 65 ఏళ్ల వృద్దురాలు బిగ్‌ ఫైట్‌

 బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆ టన్నెల్‌ వద్ద ఆరుగురి  ప్రాణాలు బలిగొన్న వాళ్లను శిక్షించేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

Also Read: వాటే థాట్.. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే.. ఒంటెలపై మద్యం అక్రమ రవాణా

Advertisment
తాజా కథనాలు