/rtv/media/media_files/2025/07/22/hyderabad-rain-update-2025-07-22-18-16-18.jpg)
Hyderabad rain update
Rain Update : తెలంగాణలో వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తు్న్న వర్షాలతో రాష్ర్టం తడిచి ముద్దవుతుంది. కాగా రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇది కూడా చూడండి:ఇదేం ట్రాఫిక్ రా బాబు.. హైటెక్ సిటీ ఏరియాలో వాహనాలు ఎలా ఆగాయో చూడండి-PHOTOS
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక, హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపెల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది.
ఇది కూడా చూడండి:TG-AP Rains: తెలంగాణ, ఏపీకి రెయిన్ అలర్ట్.. డేంజర్‌లో ఉన్న జిల్లాలివే!
తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు వరదల వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని అధికారులు సూచించారు. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వర్షం వల్ల రవాణా వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని అంచనా. జిల్లా అధికారులు వరద నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. నీటి ఆధారిత ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ వర్షాలు రైతులకు కొంత ఊరట కలిగించినప్పటికీ, అతి వర్షం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read : Liquor smuggle: వాటే థాట్.. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే.. ఒంటెలపై మద్యం అక్రమ రవాణా
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆటంకాలు, తక్కువ ప్రాంతాల్లో నీరు నిలవడం వంటి సమస్యలు తలెత్తవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అనవసర యాత్రలు చేయకుండా ఇంటిలోనే ఉండాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ బృందాలు నగరంలో వర్షం ప్రభావాన్ని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ వర్షాలు నగర జీవనాన్ని స్తంభింపజేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:TG-AP Rains: తెలంగాణ, ఏపీకి రెయిన్ అలర్ట్.. డేంజర్‌లో ఉన్న జిల్లాలివే!