Modi Govt: హరీశ్, కేటీఆర్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది? బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది. By Nikhil 12 Nov 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ కు కేంద్రంలోని మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వీరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను కలుపుతూ హైవే నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు నలుగు లైన్ల హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి రూ.1100 కోట్లను అనుమతులు ఇచ్చింది. ఈ రోడ్డు పొడవు 36 కి.మీ ఉండగా.. 25 చోట్ల డేంజర్ మలుపులు ఉన్నాయి.ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ వరకు హైవే 365బీ ఉంది. అయితే.. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ రోడ్డును సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకు పొడిగించనున్నారు. దీంతో దుద్దెడ–సిద్దిపేట మధ్య పనులు చేపట్టారు. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్లేవారు ఈ రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తుంటారు.ఇది కూడా చదవండి: నువ్వు బ్రోకర్ వి కాదు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్! 36 కి.మీ దూరం.. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు 36 కి.మీ దూరం ఉంటుంది. ఈ రోడ్డుపై 25చోట్ల డేంజర్ మలుపులు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతీ కిలో మీటరున్నరకు ఓ మలుపు ఉంటుందన్నమాట. దీంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణంతో వాహనదారుకలు ఈ టర్నింగ్ ల టెన్షన్ తప్పనుంది. ఈ రోడ్డు మార్గంలో సిరిసిల్ల మానేరు వాగుపై మరో కొత్త బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇది కూడా చదవండి: BREAKING: సీఎం రేవంత్ ఇలాఖాలో హైటెన్షన్.. ఇంటర్నెట్ బంద్! 150 ఫీట్ల వెడెల్పు.. 54 కి.మీ పొడుగు.. సూర్యాపేట నుంచి దుద్దెడ వరకు ఉన్న ఈ రహదారి 365బీని ఎక్స్‌టెన్షన్ చేస్తూ మొత్త 54 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. 150 అడుగుల(ఫీట్ల) వెడల్పుతో రూ.1100 కోట్ల నిధులతో ఈ నేషనల్ హైవేను కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ సైతం పూర్తి అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. నూతనంగా నిర్మించనున్న దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల రూట్లో త్వరలోనే భూసేకరణను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. సిరిసిల్లలోని బైపాస్ రోడ్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపం నుంచి ఈ రోడ్డుకు అధికారులు అలైన్‌మెంట్ ఇచ్చారు. Also Read : BREAKING: పోసానిపై కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ప్రత్యేకత లేదంటున్న బీఆర్ఎస్, బీజేపీ.. బీఆర్ఎస్ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు నియోజకవర్గాలు కలుపుతూ చేపట్టబోయే హైవే నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనికి ప్రత్యేకత ఏమీ లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అమృత్ స్కీమ్ టెండర్లలో రేవంత్ తన బావమరిది సృజన్ కు లబ్ధి చేశాడని ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరో వైపు కేసుల నుంచి కాపాడుకోవడానికే కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నాడని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. Also Read : ఈ గర్భనిరోధక మాత్రలకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు #modi #brs-mla-harish-rao #ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి