/rtv/media/media_files/2024/11/12/h5n1Fr1a5yNzw1xA6mIT.jpg)
Virat Kohli : బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ మొదలుకానుండగా.. ఆదివారమే విరాట్ పెర్త్ లో అడుగుపెట్టాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ.. ఈసారి ఎలాగైన రాణించాలనే కసితో ఉన్నాడు. ఇందులో భాగంగానే వీలైనంత ప్రాక్టీస్ చేసేందుకు తొలి బృందంతోనే ఆసీస్ వెళ్లాడు. అతనితోపాటు శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, సహాయక కోచ్ అభిషేక్ నాయర్ కూడా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టారు. ఇక కోచ్ గౌతమ్ గంభీర్, బుమ్రాతో రెండో బృందం సోమవారం అక్కడికి చేరుకుంది.
Also Read : జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
🗣️ We are absolutely keen to go out there, perform, and try and win the series
— BCCI (@BCCI) November 11, 2024
Head Coach Gautam Gambhir ahead of #TeamIndia's departure to Australia for the Border-Gavaskar Trophy.#AUSvIND | @GautamGambhir pic.twitter.com/MabCwkSPGL
Also Read : 'RRR' లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన హీరో
పాంటింగ్ వ్యాఖ్యలపై గంభీర్ ఫైర్..
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఫామ్ గురించి రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై భారత కోచ్ గంభీర్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. కోహ్లి గత అయిదేళ్లలో రెండు సెంచరీలు మాత్రమే చేసినట్లు చదివి ఆశ్చర్యపోయా. ఇది ఆందోళన కలిగించే విషయమే. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇలాంటి గణాంకాలతో ఉండడేమో అని పాంటింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Pushpa 2 : 'గేమ్ ఛేంజర్' ను ఫాలో అవుతున్న 'పుష్ప2'..!?
దీంతో పాంటింగ్ కామెంట్స్ పై స్పందించిన గంభీర్.. పాంటింగ్ ఆస్ట్రేలియా గురించి ఆలోచిస్తేనే మంచిదంటూ అసహనం వ్యక్తం చేశాడు. పాంటింగ్‌కు భారత క్రికెట్‌తో ఏం పని? కోహ్లి, రోహిత్‌ల విషయంలో ఆందోళన అవసరం లేదు. భారత క్రికెట్ కోసం వాళ్లు ఎంతో చేశారు. వాళ్లు ఎంతో సాధించాలని కోరుకుంటున్నారు. గత సిరీస్‌లో ఫలితంతో మాకు సంబంధం లేదు ఈ సిరీస్ గెలవడమే మా లక్ష్యం' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: హరీశ్, కేటీఆర్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది?