/rtv/media/media_files/2025/04/21/0H37zPVcqo8B5llnN3o4.jpg)
భద్రాద్రి కొత్తం గూడెం జిల్లా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు సర్కిల్ ఇన్పెక్టర్లు ACBకి పట్టుబడ్డారు. గ్రావెల్ లైసెన్స్ కోసం రూ.30వేలు లంచం ఫోన్ పే చేయించుకొని భద్రాచలం సీఐ రమేష్, గన్‌మెన్ అడ్డంగా దొరికిపోయారు. అది జరిగిన 10 రోజుల్లోనే మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 21న సీఐ సతీష్ కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. పీఎస్ లో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా సీఐ సతీష్ కుమార్, ఆయన అనుచరుడు జర్నలిస్ట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Also read: Hydrogen Bomb: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా
మణుగూరు సీఐ సతీష్ కుమార్ ఓ భూమి సెటిల్ మెంట్ విషయంలో ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి రూ.15 లక్షల వరకు డిమాండ్ చేశాడు. రూ.4 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా ముందుగా రూ. లక్ష పోలీస్‌స్టేషన్‌లో సీఐ అనుచరుడికి(జర్నలిస్ట్ ) ఇస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ టీవీ ఛానల్ జర్నలిస్ట్ తో పాటు స్టేషన్ సీఐ ఫోన్లను తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
Also Read : మాయ లేడీ.. అండర్‌వేర్స్ ఎలా చోరీ చేసిందో చూశారా? - ‘కి’లేడీ మామూల్ది కాదు భయ్యా!