Independents: కొత్తగూడెంలో ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్ గూటికి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు

కొత్తగూడెం మున్సిపాలిటీ ఎవరికి దక్కనుందో అనే ఉత్కంఠకు తెర వీడింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

New Update
kothagudem

కొత్తగూడెం మున్సిపాలిటీ(kothagudem corporation results) ఎవరికి దక్కనుందో అనే ఉత్కంఠకు తెర వీడింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలోని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(minister-ponguleti-srinivas) సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. దీంతో కాంగ్రెస్ మద్దతుదారులు సంఖ్య సీపీఎంతో కలిసి 28కి చేరింది. సులభంగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానం అధికారపార్టీ కైవసం చేసుకోనుంది.

Also Read :  కింగ్ మేకర్ గా ఎంపీ రఘునందన్.. మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్!

Five Independents Won Independently In Kothagudam Municipality

Also Read :  రసకందాయంలో కొత్తగూడెం మేయర్‌ పీఠం.. పట్టు వీడని కాంగ్రెస్.. క్యాంపుల్లో అభ్యర్థులు

మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఈ ఐదుగురు కార్పొరేటర్లకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సీరపు సుగుణ (1వ డివిజన్), తలుగు శాంతా (13వ డివిజన్), బట్టు విజయలక్ష్మి (34వ డివిజన్), దున్నపోతుల మణి (42వ డివిజన్), ధర్మసోత్ నరేష్ (48వ డివిజన్) ఉన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్లు(Independents) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొని కొత్తగా చేరిన వారికి అభినందనలు తెలిపారు. ఈ చేరికలతో కొత్తగూడెం మున్సిపల్ పాలకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్టు మరింత బిగిసినట్లయింది. - kothagudem corporation elections

Advertisment
తాజా కథనాలు