/rtv/media/media_files/2026/02/14/political-heat-rises-in-mahbubnagar-mayor-seat-2026-02-14-20-23-20.jpg)
Political Heat in sangareddy
BIG BREAKING: సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మెజారిటీ సాధించిన బీఆర్ఎస్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతుంది. జిల్లాలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను గెలుచుకున్న BRS మిగిలిన నాలుగు మున్సిపాలిటీలైన జిన్నారం, ఇస్నాపూర్, కోహిర్, జహీరాబాద్ లపై కన్నేసింది. తాజాగా జిల్లాలో మూడో మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థి BRS లో చేరడంతో బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ కి చేరుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీలో మొత్తం 16వార్డులుండగా స్వతంత్ర అభ్యర్థి చేరికతో10 స్థానాలు దక్కించుకుని బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది.
దీంతో జిల్లాలో బీఆర్ఎస్కు మూడు మున్సిపాలిటీలు దక్కినట్లయింది. జిన్నారం, ఇస్నాపూర్, కోహిర్, జహీరాబాద్ మున్సిపాలిటీలపై సస్పెన్స్ కొనసాగుతుంది.ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. ఇస్నాపూర్ లో మొత్తం 26 వార్డుల్లో 12 BRS, 10 కాంగ్రెస్, 4 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఒక స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్లోకి, మిగిలిన ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్లోకి వెళ్లడంతో ఇరు పార్టీల బలం 13కు చేరుకుంది. అయితే ఎక్స్ అఫిషియో ఓటుతో ఇస్నాపూర్ ను దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ వేస్తుండగా BRS నుంచి గెలిచిన ఓ కౌన్సిలర్ కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. దీంతో ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటుపై ఇరుపార్టీల భవితవ్యం ఆధారపడింది. ఆయన ఎవరికీ ఓటు వేస్తాడనేది ఉత్కంఠగా మారింది.
Follow Us