/rtv/media/media_files/2025/08/14/rakhi-2025-08-14-10-24-55.jpg)
ఉత్తర్‌ప్రదేశ్ ఔరయా జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రక్షాబంధన్ రోజే చెల్లి వరుసైన బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడో కామాంధుడు. బాలికతో ఉదయం రాఖీ కట్టించుకుని, రాత్రి మద్యంమత్తులో అత్యాచారం చేసి హతమార్చాడు. మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో బయటపడ్డ అసలు నిజం బయటపడింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
UP man rapes, kills teenager cousin hours after rakhi ceremony, hangs her from noose | Indiablooms - First Portal on Digital News Management https://t.co/iSQBWMmDRe#UttarPradesh#Rape#Rakhi#TeenRapeMurder#AuraiyaRapeMurder
— India Blooms (@indiablooms) August 12, 2025
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యకు చెందిన 33 ఏళ్ల సుర్జీత్ అనే వ్యక్తి్కి 14 ఏళ్ల బాలిక వరుసకు చెల్లి అవుతుంది. రక్షాబంధన్ రోజున బాధితురాలు అతనికి రాఖీ కట్టింది. అదే రాత్రి, బాగా మద్యం తాగిన ఇంటికి వెళ్లాడు. గదిలో నిద్రపోతున్న 14 ఏళ్ల బాలికపై సుర్జీత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపి, మృతదేహాన్ని ఉరికి వేలాడదీశాడు. ఆమె తండ్రి ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తుండటంతో పాపం ఈ విషయం అతనికి తెలియకుండా పోయింది.
మరుసటి రోజు సుర్జీత్ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి చేరుకున్న పోలీసులకు అనేక చోట్ల రక్తపు మరకలు కనిపించడంతోనే అది ఆత్మహత్య కాదని తేల్చేశారు. కుటుంబ సభ్యులను ప్రశ్నించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యులను ప్రశ్నలు అడిగినప్పుడు, సుర్జీత్ వారి తరపున సమాధానం ఇచ్చాడు. చివరికి సుర్జీత్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. బాధితురాలి గోళ్లు, చేతిలో ఉన్న సుర్జీత్ వెంట్రుకల నమూనాలతో నిందితుడిని పట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. 22 ఏళ్ల దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్‌లపై వెంటాడి, వెంటాడి ఎత్తుకెళ్లి మరీ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీసీకెమెరాల సాక్షిగా ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. యువతి రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితురాలు ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలాల్లో ఆమె పడి ఉండటం గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల నివాసాలకు కొంత దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టి
మరోవైపు ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టి 32 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గృహ హింస కారణంగా భర్తను విడిచిపెట్టిన నలుగురు పిల్లల తల్లి బెంగళూరు నుంచి రైలులో ఢిల్లీకి చేరుకుంది. ఆమెకు ప్రయాణంలో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడగా.. ఆ వ్యక్తి ముండ్కా ప్రాంతంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపింది.