KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

HCU భూవివాదంలో ప్రభుత్వ తొందరపాటుతో సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు పోయిందని బీఆర్ఎస్ అధినేత అన్నారు. శనివారం ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులతో సమావేశమైయ్యారు. విద్యార్థుల శాంతియుత పోరాటాన్ని కేసీఆర్ అభినందించారు.

New Update
HCU land issue KCR

HCU land issue KCR Photograph: (HCU land issue KCR)

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం హెచ్సీయూ భూవివాదంపై మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వ తొందరపాటు చర్యలతో సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు పోయిందని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం, అటవి భూముల కోసం హెచ్సీయూ విద్యార్థుల శాంతియుత పోరాటాన్ని కేసీఆర్ అభినందించారు. ప్రజల ఆకాంక్షలు ఉద్యమపార్టీ బీఆర్ఎస్‌కే తెలుసని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వేదికగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు కీలక సూచనలు చేశారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Also read: Sri Rama Navami: కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య సన్నిదికి సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలకు, నీళ్లకు తేడా తెలిసిందని చెప్పుకొచ్చారు. ఏం కోల్పోయారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని ఆయన చెప్పారు. సాగు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయర ఆరోపించారు. BRS రజతోత్సవ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలివస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ‌ సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. త్వరలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. 

 

 

 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana Cabinet : సీఎం రేవంత్ రెడ్డికి షాక్.. మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్!!

చెన్నూర్ MLA వివేక్‌కు, మాలలకు మంత్రి పదవి ఇవ్వద్దని మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం అధిష్ఠానాన్ని కలవనున్నారు. మే 30న అధిష్టానంతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. 30న కొత్త మంత్రుల పేర్లు ఖరారు అవుతాయని సమాచారం.

New Update
Meenakshi Natarajan Revanth Reddy

Meenakshi Natarajan Revanth Reddy

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ రోజుకో మలుపు తిరుగుతోంది. అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ ముహుర్తాలు వాయిదా పడుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో చిక్కుముడి వచ్చి పడింది. మంత్రి పదవుల మధ్య కాంగ్రెస్ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. పదవి నేనంటే.. నేను అర్హుడనని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశభావం వ్యక్తం చేస్తు్న్నారు. మే 30న అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. 30న కొత్త మంత్రుల పేర్లు ఖరారు అవుతాయని సమాచారం. బుధవారం కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమావేశమయ్యారు. హైదర్‌గూడలోని క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల నేతలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్‌ విడివిడిగా సమావేశం కానున్నారు.

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వదని.. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని కొందరు కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవి మాల సామజికవర్గానికి కాకుండా, మాదిగలకు ఇవ్వాలని సీఎం రేవంత్‌ని కలిసి MLAలు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడానికి రేపు ఢిల్లీకి మాదిగ కాంగ్రెస్ MLAలు వెళ్లనున్నారు. ఇప్పటికే హైకమాండ్‌కు 2 సార్లు లేఖ రాశారు. గతంలోనే చాలా సార్లు మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడింది. ఎప్పుడో అయిపోవాల్సిన మంత్రి వర్గ విస్తరణ.. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా జరగలేదు. ఎమ్మెల్యేల అసంతృప్తి సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్, కాలే యాదయ్య, మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతా రావు లు రేపు ఢిల్లీ బయలుదేరుతున్నారు.

telangana-cabinet-expansion | congress-mlas | high-command | Delhi Congress High Command | cm-revanth-reddy | latest-telugu-news

Advertisment
Advertisment