Sri Rama Navami: కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య సన్నిదికి సీఎం రేవంత్ రెడ్డి

శ్రీరామ నవమి సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రాచలం రామాలయాన్ని సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి దంపతులు రాముల వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయనున్నారు.

New Update
Revanth Reddy family

Revanth Reddy family Photograph: (Revanth Reddy family)

శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రాచలం రామాలయాన్ని సందర్శించనున్నారు. సిఎం  రేవంత్‌  రెడ్డి దంపతులు ఆదివారం రాముల వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. స్వామి వారి కళ్యాణం అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినవ విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, దేశాదయ శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.

Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

ఏపీ ప్రభుత్వం తరపున డిప్యుటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు డిప్యుటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క లు హాజరుకానున్నారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు