PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం లభించింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక మిత్ర విభూషణ పతకంతో ఆయన్ని సత్కరించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేసినందుకు మోదీకి శ్రీలంక ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించింది.

New Update
srilanka award to PM

భారత ప్రధాని మోదీ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలకు కృషి చేసినందుకు మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది శ్రీలంక. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక మిత్ర విభూషణ పతకంతో ఆయన్ని సత్కరించారు. అత్యున్నత పౌర పురస్కారం లభించిన సందర్భంగా.. ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేశారు. 

Also read: Sri Rama Navami: కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య సన్నిదికి సీఎం రేవంత్ రెడ్డి

Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

ఇది శ్రీలంక, భారతదేశ ప్రజల మధ్య చారిత్రక సంబంధం, స్నేహ్నానికికి నిదర్శనమని మోదీ అన్నారు. మిత్ర విభూషణ పతకంలో ధర్మ చక్రం రెండు దేశాల సాంస్కృతిక సంప్రదాయాలను రూపొందించిన ఉమ్మడి బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. బియ్యం ముక్కలతో అలంకరించబడిన పున్ కలశ (ఒక ఉత్సవ కుండ) శ్రేయస్సు మరియు పునరుద్ధరణను సూచిస్తుంది. తొమ్మిది విలువైన రత్నాలు రెండు దేశాల మధ్య అమూల్యమైన మరియు శాశ్వతమైన స్నేహాన్ని సూచిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు