బీఆర్ఎస్‌లో కవిత ఇష్యూ సంచలనంగా మారింది. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఉన్నట్టుండి సొంత పార్టీలో కవిత అసంతృప్తి వెల్లగక్కింది. దీంతో కేటీఆర్, కవితల మధ్య కేసీఆర్ సయోధ్య కుదర్చలేకపోతున్నారని సమాచారం. దీంతో పార్టీని చక్కబెట్టే బాధ్యతలు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో వారంలో 4సార్లు హరీష్ భేటీ అయ్యారు. ఎర్రవవెల్లి ఫాంహౌస్ గులాబీ బాస్‌తో హరీశ్ రావు మంతనాలు జరుపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కవిత గొడవ హరీష్‌కు లాభం కానుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. బీఆర్ఎస్‌లో కవిత వ్యవహారం ముదురుతోంది. కేసీఆర్, కేటీఆర్ ఫోన్లను కవిత లిఫ్ట్ చేయడం లేదంటూ ప్రచారం జరుగుతుంది. తాజా రాజకీయ పరిస్థితులపై, కాళేశ్వరం నోటీసులపై కేసీఆర్, హరీశ్ సమాలోచనలు చేస్తున్నారు. కవిత అంశంపై ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడుస్తోంది.
brs-party | kcr | Harish Rao with Kcr | BRS Harish Rao | brs-kavitha | telangana | farmhouse | KCR farmhouse | latest-telugu-news
Follow Us