/rtv/media/media_files/2025/06/11/av0j2Hn5x6j2HdA0Dlh3.jpg)
గులాబీ బాస్ కేసీఆర్ యజ్ఞ యాగాదులు, పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ఆయన వాస్తు సెంటిమెంట్‌ను కూడా నమ్ముతారు. 2023 డిసెంబర్‌లో ఆయన ఫామ్‌హౌస్‌లో కాలు జారి కిందపడ్డారు. 2025 జూన్ 11న అదే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కాలు జారి కిందపడ్డారు. ఈ రెండు సంఘటన నడుమ మరో విషాదం కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌తో ముడిపడి ఉంది. అదే బీఆర్ఎస్ అధినేతతో భేటీ అవడానికి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారు. ఇటీవల కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు కూడా తలెత్తాయి. ఫామ్‌హౌస్ వెళ్లిన BRS నేతలకు వరుసగా చెడు జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్తగా ఓ అనుమానం రేకెత్తుతుంది. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఈవిల్ పవర్స్ ఉన్నాయని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఫాంహౌస్‌లో వెళ్లినప్పుడల్లా ఎప్పుడూ ఎవరో ఒకరికి ప్రమాదం జరుగుతుంది. ఇద్దరు నేతలు ఒకే ఇంట్లో కాలు జారి పడటం, ఇద్దరికీ తుంటి ఎముకకే గాయం కావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దీని వెనక కొన్ని అదృశ్య శక్తుల ప్రమేయం ఉందని కేసీఆర్ ఫ్యాన్స్ కొందరు అనుకుంటున్నారు.
దెయ్యాలా లేక వాస్తు దోషమా...?
ఇప్పటి వరకు KCR, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముగ్గురు ఫాంహౌస్‌లో అనారోగ్యం బారిన పడ్డారు. అంతేకాదు కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు కూడా వచ్చాయి. దీంతో ఇటీవల కవిత అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నారు కొందరు. ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్‌కి రాసిన లేఖ గురించి వివరిస్తూ.. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్నారు. దీంతో కేసీఆర్ చుట్టూ నిజంగానే దెయ్యాలు ఉన్నాయా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తు్న్నారు. ఎర్రవల్లి ఫౌంహౌస్‌లో దుష్టశక్తులు ఉన్నాయా.. లేక వాస్తు దోషం ఉందా అనే సందేహం మొదలైంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో దుష్ట శక్తులు ఉన్నాయనీ.. అవే ఇలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయని అంటున్నారు. ఫామ్‌హౌస్‌కి కొన్ని ప్రత్యేక పూజలు చెయ్యాలనీ, దుష్ట శక్తుల సంహారం జరపాలని అంటున్నారు. కేసీఆర్ వాస్తు దోషాలను బాగా నమ్ముతారు. అందుకే ఆయన పాత సెక్రటేరియట్‌లోకి వెళ్లలేదు. వాస్తు దోషాల కారణంగానే ఆయన కొత్తగా సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టించుకున్నారని వార్తలు వచ్చాయి.
ఫామ్‌హౌస్‌లో జారిపడ్డ KCR
2023 డిసెంబర్‌లో ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కాలు జారి పడ్డారు. అప్పుడే వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ ఓడిపోయారు. ఆ సమయంలో.. రాత్రివేళ.. కేసీఆర్ కాలు జారి పడిపోయారు. ఆయన.. బాత్రూంలో జారి పడ్డారనే వాదన ఉంది. ఏది ఏమైనా ఆ తర్వాత ఆయన్ని హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌కి తరలించి, చికిత్స అందించారు. ఆయనకు తుంటి ఫ్రాక్చర్ అయ్యింది. ఆ తర్వాత చాలా నెలలపాటూ.. ఆయన ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలు ఫ్యాక్ఛర్
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లి జారి పడ్డారు. ఆయనకు కూడా తుంటి ఎముక విరిగిందని తెలిసింది. బుధవారం కేసీఆర్, కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరవుతున్న విషయం తెలిసిందే. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎర్రవల్లికి వెళ్లారు. కేసీఆర్‌ని కలిసి పరామర్శించాలి అనుకున్నారు. అంతలోనే ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. దాంతో ఆయన్ని కూడా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికే తరలించారు. అక్కడ ఆయనకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
నివారణ పూజలు చేస్తుస్తారా??
కేసీఆర్ ఫాంహౌస్‌లో వరస ప్రమాదాలకు శాంతి మార్గం ఎమైనా చేయిస్తారా? దుష్టశక్తులను నివారించడానికి పూజలు చేస్తారా అని చర్చించుకున్నారు. గతంలో కూడా అనేక సార్లు చంద్ర శేఖర్ రావు యజ్ఞ యాగాదులు, పూజలు చేయించారు.