Adilabad : దెయ్యం ఉందని విద్యార్థుల వణుకు.. దెబ్బకు భయాన్ని వదిలించిన టీచర్!
ఆదిలాబాద్ జిల్లా ఆనంద్ పూర్ పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. ఈ భయాన్ని పొగొట్టేందుకు నూతల రవీందర్ అనే ఉపాధ్యాయుడు అమావాస్య రోజు రాత్రి పాఠశాలలో నిద్రించి ఎలాంటి దెయ్యాలు లేవని నిరూపించారు. దీంతో విద్యార్థులు ధైర్యంగా పాఠశాలకు వస్తున్నారు.