/rtv/media/media_files/2025/06/08/og2fRR8eS0um9rC7bHw3.jpg)
K. T. Rama Rao
Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి హైదరాబాద్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్యే అకాల మరణంపై ఆమె సంతాపం తెలిపారు. ఆమె ఎక్స్‌లో స్పందిస్తూ .. "జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, శోఖార్తులైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
హిమాన్ష్ దిగ్భ్రాంతి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృత దేహాన్ని మాదాపూర్ లోని స్వస్థలానికి తరలించారు. ఎమ్మెల్యే మాగంటి మృతి పట్ల బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. హుటాహుటిన కేటీఆర్, తనయుడు హిమాన్షు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని,అక్కడ నుంచి మాదాపూర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. కేటిఆర్ తనయుడు హిమాన్షు, మాగంటి గోపినాథ్ తనయుడు వాత్యల్య నాథ్ ఇద్దరు స్నేహితులు. గతంలో ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఈ ఘటన పై హిమాన్షు తన స్నేహితుడు కి ధైర్యం చెప్పేందుకు తోడుగా వచ్చారు.కాగా గోపీనాథ్ మృతిని తట్టుకోలేక ఆయన తనయుడు వాత్సల్యనాథ్ కన్నీరు పెట్టుకున్నారు. ఆయనను హిమాన్స్ ఓదార్చరు.
ఇది కూడా చదవండి: నిద్రలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే!
ఇది కూడా చదవండి: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!
Follow Us