/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/holidays-1-jpg.webp)
holidays
సాధారణంగా విద్యార్థులకు ఆదివారాలు, పండుగలకు సెలవులు ఇవ్వడం కామన్. అలా కాకుండా మధ్యలో విద్యార్థి సంఘాలు ఏవైనా బంద్‌లకు పిలుపునిస్తే.. ఎవరైనా ప్రముఖులు మరణిస్తేనో ఇలా ప్రత్యేక సందర్భాల్లోనే అదనపు సెలవులు కూడా వస్తుంటాయనే సంగతి తెలిసిందే.
Also Read: Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!
అలాకాకుండా.. విద్యాసంస్థల యాజమాన్యామే స్వయంగా విద్యార్థులకు అదనపు సెలవులు ఇచ్చిందంటే.. అంతకంటే గుడ్ న్యూస్ మరోకటి ఉంటుందా?. ఇప్పటి వరకు విద్యార్థులకు నెలలో నాలుగు ఆదివారాలు, పండగలు, పబ్బాలకు మాత్రమే సెలవులు ఉండేవి.
Also Read: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఉద్యోగులకు కూడా హాలిడే...
అయితే.. ఇక నుంచి ప్రతి నెలా నాలుగో శనివారం కూడా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకుంది హైదరాబాద్ జేఎన్టీయూ . కేవలం విద్యార్థులకు మాత్రమే సెలవు ఇచ్చి సిబ్బందికి ఇవ్వకపోతే ఎలా.. ఉద్యోగులకు కూడా హాలిడే ప్రకటించేసింది. ఈ మేరకు.. జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ గురువారంఈ కీలక ప్రకటన జారీ చేసింది.
యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు, కార్యాలయాలకు ఇక నుంచి నాలుగో శనివారం సెలవు ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర రావు ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన నాలుగో శనివారం సెలవు.. ఈనెల నుంచే అమలు కానుంది. ఈ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో ఈనెల 22వ తేదీన నాలుగో శనివారం విద్యార్థులకు సెలవు రానుంది. నాలుగో శనివారం కార్యాలయాలు, కళాశాలలకు సెలవు దినం ప్రకటించటంతో.. విద్యార్థులతో పాటు ఆచార్యులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందికి కూడా హాలిడే రానుంది.
అయితే.. జేఎన్‌టీయూ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 423 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటికి నాలుగో శనివారం సెలవు దినం ప్రకటన వర్తించనుంది. అయితే నాలుగో శనివారం సెలవు అనేది గతంలోనే ఉండేది. ఇంతకుముందు 2008కి ముందు కూడా ఈ నాలుగో శనివారం సెలవు అమల్లో ఉండేది. కాగా.. 2008లో దీనిని రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే పద్దతిని తిరిగి ప్రకటించారు. యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, ఉద్యోగులు, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!
Also Read: Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన