Telangana: విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య

గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

New Update
Jagtial Youth Dies by Suicide in Bahrain on Birthday, Family Suspects Foul Play

Jagtial Youth Dies by Suicide in Bahrain on Birthday, Family Suspects Foul Play

కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేక బతుకుదెరువు కోసం చాలామంది గల్ఫ్(gulf) దేశాలకు వెళ్తుంటారు. అక్కడ వారు ఎండల్లో కష్టపడి పనిచేస్తూ తమ కుటుంబాలకు నెలనెలా డబ్బులు పంపిస్తూ పోషించుకుంటారు.  అయితే గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన ఓ యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలో టాకా వీధికి చెందిన అనుమల్ల శంకర్‌-లావణ్య దంపతులకు కుమారుడు కల్యాణ్ (26), కుమార్తె ఉన్నారు. 

Also Read: అల్‌ఫలా యూనివర్సిటీ మరో బిగ్‌ షాక్.. సభ్యత్వం రద్దు

Jagtial Youth Dies By Suicide In Bahrain On Birthday

కుటుంబానికి ఆర్థికంగా నిలబడేందుకు కల్యాణ్ పది నెలల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ కార్ల వర్క్‌షాప్‌లో పనిలో చేరాడు. కానీ ఆ కంపెనీలో జీతం తక్కువగా ఉండటంతో మరో పని కోసం వర్కింగ్‌ వీసా గురించి ఓ ఏజెంట్‌కు కొంత డబ్బును ఇచ్చాడు. మంగళవారం రోజున కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా గదిలో బర్త్‌ డే పార్టీ చేశారు. వీడియో కాల్‌ ద్వారా అతడు తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాడు. 

Also Read: కొండా సురేఖకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు విత్ డ్రా!

కానీ అదే రోజు రాత్రి అర్ధరాత్రి ఉరేసుకున్నాడు. అక్కడున్న కార్మికులు కల్యాణ్‌ను చూసి షాకైపోయారు. బుధవారం ఉదయం అతడి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసిందే. కొడుకు మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కల్యాణ్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే వీసా ప్రాసెసింగ్ విషయంతో తమ కొడుకుకు కొత్త ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు