Konda Surekha vs Nagarjuna : కొండా సురేఖకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు విత్ డ్రా!

మంత్రి కొండా సురేఖ, సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పారు. దీంతో మంత్రి సురేఖపై నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన డిఫమేషన్ కేసును  నాగార్జున విత్ డ్రా చేసుకున్నాడు.

New Update
FotoJet (87)

Nagarjuna vs Konda Surekha Case withdrawn

Konda Surekha vs Nagarjuna : మంత్రి కొండా సురేఖ, సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పారు. దీంతో మంత్రి సురేఖపై నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన డిఫమేషన్ కేసును  నాగార్జున విత్ డ్రా చేసుకున్నాడు.  దీంతో అక్కినేని ఫ్యామిలీతో సురేఖ వివాదానికి ఎండ్‌ కార్డ్‌ పడింది.


 
 కాగా అంతకు ముందు మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు ఈరోజు విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసును 2025, డిసెంబర్ 2వ తేదీకి విచారణ వాయిదా వేసింది . నాగార్జున పిటిషన్‎పై ఈ రోజు గురువారం (నవంబర్ 13) కోర్టులో విచారణ జరగగా మంత్రి కొండా సురేఖ హాజరుకాలేదు. ఆమె తరుఫు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది న్యాయస్థానం.  అయితే ఈ లోపు నాగార్జున కేసును ఉపసంహరించుకోవడంతో కేసును కోర్టు మూసివేసింది.

అసలేం జరిగిందంటే..

గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్‌‌‌‌, సోషల్‌‌‌‌మీడియా లింక్స్‌‌‌‌తో నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
తమ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్‌‌‌‌ చర్యలతో పాటు పరువునష్టానికి సంబంధించి బీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ 356 కింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‎పై నాంపల్లి కోర్టులో ప్రస్తుతం విచారణ నడుస్తోంది.  

నాకు ఆ ఉద్దేశం లేదు..

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువునష్టం దావా వేయగా.. ప్రస్తుతం అది కోర్టులో నడుస్తున్న క్రమంలో మంత్రి ఈ నెల 11న అర్ధరాత్రి సంచలన ట్వీట్ చేశారు. గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు అర్థరాత్రి ట్వీట్ చేశారు.  అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కొండా సురేఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. నాగార్జున, ఆయన కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే, అందుకు తాను చింతిస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే నాగార్జున కేసును ఉపసంహరించుకున్నారు.
 

Advertisment
తాజా కథనాలు